జిడ్డుకు అడ్డు
సీజన్ మారింది. మొన్నటి వరకూ మండు టెండల్లో చెమటలు కక్కిన చర్మం తొలకరి రాకతో వాతావరణంతో పాటు తన తత్వాన్ని కూడా మార్చుకోనున్నది. దంచికొట్టే వానల్లో ఒకవైపు చల్లగాలులు, మరోవైపు వేడి. వీటి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..
సీజన్ మారింది. మొన్నటి వరకూ మండు టెండల్లో చెమటలు కక్కిన చర్మం తొలకరి రాకతో వాతావరణంతో పాటు తన తత్వాన్ని కూడా మార్చుకోనున్నది. దంచికొట్టే వానల్లో ఒకవైపు చల్లగాలులు, మరోవైపు వేడి. వీటి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..
- వాతావరణంలో తేమ శాతం పెరిగినప్పడు చర్మం జిడ్డుగా మారుతుంది. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒకటే మార్గం.. ఆయిల్ ఫ్రీ ఫేస్‌వాష్‌తో రోజుకు రెండుసార్లయినా శుభ్రంగా కడుగుతూ ఉండాలి. ఆయిల్ బేస్డ్ మేకప్ రిమూవర్కు కాస్త దూరంగా ఉండాలి.
- తేమ వాతావరణంలో బయటికి వెళ్లాల్సి వస్తే లైట్ మేకప్ ఉత్తమం. రాత్రిపూట రాసుకునే క్రీములను వీలైనంత తగ్గించాలి.
- స్కిన్ కేర్ కోసం వాడే టోనర్లు చర్మ రంధ్రాలను కప్పేస్తాయి. దీంతో చర్మం నిగారింపును కోల్పోతుంది. కొత్త చర్మ సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది.
- బయటికి వెళ్లేటప్పుడు అవసరమైతే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. దీనివల్ల చర్మం మరింత తేమకు గురి కాకుండా ఉంటుంది.
- నిద్రలో చర్మం డీహైడ్రేట్ కాకుండా.. తేలికపాటి వాటర్ మాయిశ్చరైజర్లను రాయాలి.
- వర్షంలో బయటికి వెళ్లి వస్తే.. వీలైనంత తొందరగా మొహం కడుక్కోవాలి. లేదంటే, గాలిలోని కాలుష్య కారకాలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
- క్రీముల వాడకం, వాతావరణ మార్పుల వల్ల చర్మ సమస్యలు వస్తే వీలైనంత త్వరగా
చర్మవ్యాధి నిపుణులను కలవండి. - వర్షాకాలంలో వీలైనంత వరకూ పూర్తిగా కప్పేసే పాదరక్షలు వద్దు. వీటివల్ల వేళ్ల మధ్య ఫంగస్ లాంటివి ఏర్పడతాయి. పగుళ్లు, చర్మ సమస్యలు రావచ్చు.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

