ముడతలతో మడత పేచీ
పైలా పచ్చీసు వయసులోనే కొంతమంది ముఖం ముడతలు పడుతుంది. దీనివల్ల వారు వయసు మళ్లిన వారిలా కనిపిస్తుంటారు. ముఖంపై ముడతలు రావడానికి కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం ఇలా ఏదైనా కారణం కావచ్చు. వీటికి తోడు దైనందిన జీవితంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా ఈ ముడతలకు కారణమవుతాయి.
పైలా పచ్చీసు వయసులోనే కొంతమంది ముఖం ముడతలు పడుతుంది. దీనివల్ల వారు వయసు మళ్లిన వారిలా కనిపిస్తుంటారు. ముఖంపై ముడతలు రావడానికి కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం ఇలా ఏదైనా కారణం కావచ్చు. వీటికి తోడు దైనందిన జీవితంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా ఈ ముడతలకు కారణమవుతాయి. అవేంటంటే..
చక్కెర ఎక్కువగా తీసుకోవడం కూడా కొంతమందిలో చర్మం ముడతలు పడడానికి కారణమవుతుందని కొన్ని పరిశోధనల సారాంశం. మోతాదుకు మించి చక్కెరను తీసుకోవడం వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోయి ముడతలు పడటం మొదలవుతుంది. కాబట్టి చక్కెర వినియోగాన్ని గణనీయంగా తగ్గించాల్సిందే!
చర్మం అందంగా, మృదువుగా కనిపించడానికి తగిన పరిమాణంలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అవసరమంటున్నారు నిపుణులు. అయితే చాలామంది లావవుతామన్న భయంతో కొవ్వు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఫలితంగా వీటి ద్వారా లభించే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందవు. ఈ ఆమ్లాలు చర్మం యవ్వనంగా ఉండేందుకు దోహదపడతాయి. అంతేకాదు.. ఇవి మెదడు చురుగ్గా పని చేయడానికి కూడా తోడ్పడతాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలనూ అవసరమైన మేరకు ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

