Beauty Tips | పిల్లలు పుట్టిన తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలా? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!
Beauty Tips | పురిటి నొప్పులను అమ్మ ధైర్యంగా ఎదుర్కొంటుంది. కానీ, కాన్పు తర్వాత తనలో జరిగే మార్పులు ఆమెకు ప్రతి క్షణం సవాలుగా నిలుస్తాయి. డెలివరీ తర్వాత శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ లాంటి హార్మోన్ల స్థాయులు పడిపోతాయి.
Beauty Tips | పురిటి నొప్పులను అమ్మ ధైర్యంగా ఎదుర్కొంటుంది. కానీ, కాన్పు తర్వాత తనలో జరిగే మార్పులు ఆమెకు ప్రతి క్షణం సవాలుగా నిలుస్తాయి. డెలివరీ తర్వాత శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ లాంటి హార్మోన్ల స్థాయులు పడిపోతాయి. కండ్ల ముందే కరిగిపోతున్న అందాన్ని చూస్తూ ఆమె కుంగుబాటుకు గురయ్యే అవకాశాలూ ఉన్నాయి. అలా కావొద్దంటే… ప్రెగ్నెన్సీ సమయంలో, డెలివరీ అనంతరం వచ్చే సమస్యలు, వాటిని అధిగమించే అవకాశాల గురించి తెలుసుకోవడం మంచిది..
డెలివరీ తర్వాత జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. కాన్పు తర్వాత ఆరు నెలల నుంచి 12 నెలల వరకు ఈ సమస్య కనిపిస్తుంటుంది. మరోవైపు ఒత్తిడి, అలసట కారణంగా ముఖంపై మొటిమలు వస్తాయి. దీనికితోడు నిద్రలేమి సమస్య కారణంగా హార్మోన్లలో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. కండ్ల కింద వలయాలు ఏర్పడతాయి. గర్భిణిగా ఉన్నప్పుడు శరీరంలో కొన్ని భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. డెలివరీ తర్వాత శరీరం సాధారణ స్థితికి వచ్చాక చర్మం వదులవుతుంది. దీంతో స్ట్రెచ్ మార్కులు ఏర్పడతాయి.
- కలబంద, యూకలిప్టస్ ఆయిల్‌తో చేసిన ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం పై మొటిమలు మాయమవుతాయి.
- పసుపు-నిమ్మరసం, కలబంద, ఆలుగడ్డ గుజ్జు, కమలా పండ్ల తొక్కల పొడితో ఫేస్ ప్యాక్స్‌ను తయారు చేసుకొని, అప్పుడప్పుడూ వాడుతూ ఉండాలి. దీంతో చర్మ సౌందర్యం పెరుగుతుంది.
- రోజూ ఎనిమిది గంటలు నిద్రపోవడం తప్పనిసరి. దీనివల్ల శారీరక బడలిక తీరడంతోపాటు కండ్ల కింద వలయాలు తగ్గుముఖం పడతాయి.
- వైద్యుల సూచన మేరకు బ్రిస్క్ వాక్, యోగా వంటివి రెగ్యులర్‌గా చేస్తే మంచి మార్పు కనిపిస్తుంది.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

