YS Viveka Murder Case | అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు అంశంపై విచారణ 19వ తేదీకి వాయిదా
YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్యకేసులో నేర ఆరోపణలకు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది.
అమరావతి : వైఎస్ వివేకా హత్యకేసులో నేర ఆరోపణలకు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి(MP Avinash reddy)కి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని(Bail cancellation,) సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను సమర్థించిన తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వైఎస్ వివేకానందారెడ్డి కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని స్వయంగా కోర్టులో సునీతారెడ్డి వాదనలు వినిపించారు.
సీబీఐ సేకరించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. ఇదే కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చిందని పేర్కొన్నారు. నిందితులు సాక్షులను ఎంపీ అదేపనిగా బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇందుకు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం ఎంపీ అవినాష్‌కు సహకరిస్తోందని వివరించారు.
అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్లిన సీబీఐ అధికారులను అడ్డుకున్నారని, తల్లికి అనారోగ్యం పేరుతో తప్పించుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. వివేకా హత్య గురించి జగన్‌కు ముందే తెలిసిందని సీబీఐ ఇటీవల తాజాగా పేర్కొన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.వాదనాలను విన్న సుప్రీం కోర్టు అదనపు పత్రాల సమర్పణకు అవకాశమివ్వాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

