YS Jagan | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. వైసీపీలో భారీ మార్పులకు శ్రీకారం
YS Jagan | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పార్టీలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కొత్తగా ముగ్గురికి బాధ్యతలు అప్పగించారు.
YS Jagan | ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పార్టీలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కొత్తగా ముగ్గురికి బాధ్యతలు అప్పగించారు.
గడికోట శ్రీకాంత్ రెడ్డి ( రాయచోటి), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి), వేంపల్లి సతీశ్‌రెడ్డి(పులివెందుల)ని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పార్టీని సమన్వయం చేసే బాధ్యతలను వీరికి అప్పగించే అవకాశం ఉంది. అలాగే వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా జక్కంపూడి రాజాను నియమించారు. వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా సుధాకర్ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు.
వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆళ్ల నాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు వైఎస్ జగన్ బాధ్యతలు అప్పగించారు. అలాగే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఇటీవల దుమారం రేపిన నేపథ్యంలో ఆయన్ను టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. ఆ నియోజకవర్గ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత పేరాడ తిలక్‌కు అప్పగించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | పెద్ద నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

