ఏపీపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ : ఎంపీ విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి | ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ, పక్షపాత ధోరణి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ, పక్షపాత ధోరణి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విభజన చట్టం హామీలను నెరవేర్చకుండా తెలుగు ప్రజలందరికీ కేంద్రం ద్రోహం చేస్తున్నదని ఆయన విమర్శించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన కేంద్ర అఖిలపక్ష సమావేశానికి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను సమావేశంలో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.
‘‘పోలవరం పునరావాస ప్యాకేజ్ త్వరగా ఇవ్వాలని కోరాం. ప్యాకేజ్ విడుదలలో జాప్యం చేయడం ఏపీకి ద్రోహం చేయడమే అని చెప్పాం. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని స్పష్టం చేశాం. స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి తెచ్చేందుకు ఉన్న 3 అవకాశాలను పరిశీలించాలన్నాం. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి ప్రస్తావించాం. ఏడేళ్లయినా విభజన హామీలను అమలు చేయలేదు. పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరాం. బియ్యం సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అభ్యర్ధించాం. పోలవరం, ప్రత్యేక హోదా అంశాల్లో కేంద్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నది. పెండింగ్‌లో ఉన్న దిశ బిల్లును క్లియర్ చేయాలని కేంద్రానికి విన్నవించాం’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ అంశాలను ప్రస్తావిస్తామని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కొల్లూర్ ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకున్న మహిళ.. ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

