Chandra Babu | పుంగనూరు బాలిక కుటుంబానికి న్యాయం చేస్తాం : చంద్రబాబు
Chandra Babu | చిత్తూరు జిల్లా పుంగనూరులో హత్యకు గురైన బాలిక కుటుంబానికి న్యాయం చేసి ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
అమరావతి : చిత్తూరు జిల్లా పుంగనూరు (Punganur) లో హత్యకు గురైన బాలిక కుటుంబానికి న్యాయం చేసి ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu) భరోసా ఇచ్చారు. బాలిక (Girl)కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha), మంత్రులు ఫరూఖ్, రాంప్రసాద్‌రెడ్డి ఆదివారం నాడు పుంగనూరులో బాలిక కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా బాలిక కుటుంబ సభ్యులు చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ సెప్టెంబర్ 29న బాలిక అదృశ్యం కాగా అదే రోజు రాత్రి 11 గంటలకు ఫిర్యాదు చేశారని తెలిపారు. బాలిక అచూకి కోసం ఎస్పీ వెంటనే 11 బృందాలను ఏర్పాటు చేశారని వివరించారు.
మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహం లభ్యమైందని తెలిపారు. డాక్టర్ల ప్రాథమిక నివేదిక ఆధారంగా బాలికపై అత్యాచారం జరుగ లేదన్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారని వివరించారు. అయితే ఘటనపై జగన్ రాజకీయం చేయడం సరికాదని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మేనిఫెస్టోకు మూడేళ్లు.. కాంగ్రెస్ నయవంచనకు మూడేళ్లు.. అభయ హస్తం కాస్త మొండి హస్తమయ్యిందని హరీశ్‌రావు సెటైర్లు
Kyiv Bridges: కీవ్‌లో రెండు బ్రిడ్జ్లపై రష్యా దాడి: మేయర్ క్లిచ్కో
లావుడియా తండ గ్రామ పెద్దగా వాగ్య నాయక్ ఎన్నిక
అట్టహాసంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఓపెన్.. కానీ జీతాల్లేవ్.. ఐదు నెలలుగా టీచర్ల ఎదురుచూపులు!
KCR | మళ్లీ బీఆర్ఎస్ రావాలి.. కేసీఆర్ సీఎం కావాలి.. రెండో రోజుకు చేరిన ఏడుపాయల–ఎర్రవల్లి పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

