అమరావతి : ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్తంలో రూపొందించిన ‘ ఆర్ఆర్ఆర్’ సినిమా చరిత్రలో రికార్డులు బద్ధలు కొట్టాలని కోరుకుంటున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విడుదల సందర్భంగా ఆయన చిత్రబృందానికి ‘ఆల్ ద బెస్ట్ ’ చెప్పారు. సినిమాకు మంచి స్పందన వస్తుండటం ఎంతో సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి అందించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ వారం కుటుంబ సమేతంగా సినిమాను తప్పకుండా చూస్తానని లోకేశ్ వెల్లడించారు. ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల సందర్భంగా కూడా లోకేశ్ పవన్‌కల్యాణ్‌కు అభినందనలు తెలియజేశారు.