Tirumala | తిరుమల కాలిబాటలపై టీటీడీ ఈవో సంచలన వ్యాఖ్యలు..
Tirumala | తిరుమల,తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి (TTD EO) సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి (TTD EO) సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానికి కాలిబాటన వచ్చే మార్గాన్ని మూసివేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అలిపిరి (Alipiri ) బాటన చిన్నారిని చంపివేసిన చిరుత( Leopard ) ఘటనపై శనివారం తిరుమల జేఈవో కార్యాలయంలో అటవీ శాఖ, పోలీసులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి లక్షిత (Lakshita) ఘటన బాధకరమని ఆయన అన్నారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు పాప మిస్ అయ్యిందని, పాప ఆచూకీ కోసం70 మంది దాకా సిబ్బంది రాత్రి అటవీ ప్రాంతంలో గాలించారని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా చూస్తే కాలినడక నుంచి పాప అటవీ ప్రాంతంలో వెళ్లిందా అనే కోణంలో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.
తిరుపతి నుంచి తిరుమల ఉన్న రెండు కాలిబాటలను సాయంత్రం 6 గంటలకు మూసేయాలని ఆలోచిస్తున్నామని వెల్లడించారు. ఈ విషయంపై టీటీడీ చైర్మన్, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని , ప్రతి పది మీటర్లకు సెక్యూరిటీ గార్డును నియమిస్తామని వివరించారు. కాలిబాటలో బోన్లు ఏర్పాట్లు చేస్తామన్నారు. చిరుతను బంధించేందుకు ఇప్పటికే రెండు బోన్లు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. కాలిబాటలో వచ్చే భక్తులు చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

