POCSO case | నీకూతురిని కాపురానికి పంపకపోతే నీ మనవరాలి నగ్న ఫొటోలను(Nude photos) మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని అత్తను బెదిరించిన అల్లుడిపై ఫోక్సో కేసు(POCSO case) నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా(Chittoor d) పుంగనూరు సమీపంలోని కొత్తపల్లికి చెందిన బిరుదాల ఈశ్వర్రెడ్డి (35) కొన్నేళ్లుగా తుమ్మలగుంటలో నివసిస్తున్నాడు. కాగా, కుటుంబ తగాదాలతో మొదటి భార్యతో విడిపోయిన తర్వాత రామానుజపల్లికి చెందిన కిన్నెర్లను రెండో పెళ్లి చేసుకున్నాడు. కిన్నెర సైతం మొదటి భర్తతో విడిపోయి తన కుమార్తె (17)ను తీసుకొని వచ్చి ఈశ్వర్రెడ్డితో కలిసి జీవిస్తున్నారు. ఈక్రమంలో ఈశ్వర్రెడ్డి కన్ను కిన్నెర కూతురిపై పడింది. గతేడాది కుమార్తె వరుసైన ఆ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
భార్య కిన్నెర ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపారు. బెయిల్పై బయటకొచ్చిన ఈశ్వర్రెడ్డి భార్య కిన్నెరను కాపురానికి రమ్మని పిలవగా.. ఆమె నిరాకరించింది. దీనికి భార్య తల్లి కమలమ్మ కారణమని భావించి ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అతడిపై మరో కేసు నమోదయింది. బుద్ది మార్చుకోని ఈశ్వర్రెడ్డి మళ్లీ కమలమ్మతో గొడవపడి కూతురిని కాపురానికి పంపాలని బెదిరించాడు. అదే సమయంలో కమలమ్మ కుమార్తె కిన్నెరను దుబాయికి పంపించేసి.. మనవరాలిని తన వద్ద ఉంచుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన ఈశ్వరరెడ్డి దుబాయ్ నుంచి కిన్నెరను పిలిపించకపోతే కిన్నెర కూతురు ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని కమలమ్మను బెదిరించాడు. బంధువులకు ఫొటోను షేర్ చేశాడు. కమలమ్మ ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై ఫోక్సో నమోదు చేసి అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.