Somireddy | చంద్రబాబుపై సజ్జల సెటైర్లు.. మీరా మా గురించి మాట్లాడేదంటూ మండిపడ్డ సోమిరెడ్డి
Somireddy | ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి వేసిన సెటైర్లపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదని.. ప్రజలు ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం ఎన్నిసార్లు అడుక్కుంటారని ప్రశ్నించారు.
Somireddy | ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి వేసిన సెటైర్లపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదని.. ప్రజలు ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం ఎన్నిసార్లు అడుక్కుంటారని ప్రశ్నించారు.
నియంత పోకడల నుంచి జగన్ మోహన్ రెడ్డి బయటకు రాలేకపోతున్నాడని సోమిరెడ్డి విమర్శించారు. గొడ్డలి పోటుతో చిన్నాన్నను లేపేసిన మీరా మా నాయకుడి గురించి మాట్లాడేదని మండిపడ్డారు. గతంలో సకల శాఖల మంత్రిగా వెలగబెట్టిన సజ్జల వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
నిన్న అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించిన చంద్రబాబు.. ‘ సిద్ధం.. సిద్ధం.. అని ఎగిరిపడ్డారు కదా.. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమా? వివేకా హత్య కేసు, కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాపై చర్చకు సిద్ధమా ‘ అని వైసీపీ ఎమ్మెల్యేలకు సవాలు విసిరారు. దీనిపై స్పందించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. నీ సవాలు ఏడ్చినట్లుగానే ఉందని ఎద్దేవా చేశారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వమని ప్రతి సవాలు విసిరారు.
అసలు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని సజ్జల ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల పక్షాన అసెంబ్లీలో గొంతు వినిపిస్తామని తెలిపారు. మీ మంద బలంతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. అందుకే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు సమాధానం చెప్పడానికి జగన్ ఒక్కరు చాలు అని స్పష్టం చేశారు. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడితేనే.. వాటికి సమాధానాలు చెప్పలేక బూతులు తిడుతున్నారని విమర్శించారు.
దమ్ము ఉంటే అసెంబ్లీకి రా అని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదని సజ్జల అన్నారు.చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే వెంటపడి కొడతారని హెచ్చరించారు. చంద్రబాబు మోసం చేశారని ప్రజలు భావిస్తున్నారని.. అందుకే ప్రజల దగ్గరకు వెళ్లేందుకు ఆయన భయపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు, నారా లోకేశ్‌కు అభిమానులు ఉండరని.. కానీ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన్ను కలిసేందుకు వేలాదిమంది ప్రజలు వస్తున్నారని తెలిపారు. జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు 30 ఏళ్ల సీఎం అంటే.. ఎన్టీఆర్‌ను ఎలా వెన్నుపోటు పొడిచారనేదే గుర్తుకొస్తుందని సజ్జల విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటుపై సంబురాలు చేసుకోవాలని సలహా ఇచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

