Shakambari festival | విజయవాడ దుర్గామాత ఆలయంలో ముగిసిన శాకంబరి ఉత్సవాలు
Shakambari festival | ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల పాటు జరిగిన శాకంబరి ఉత్సవాలు పూర్ణాహుతి తో ఆదివారం ముగిసాయి.
అమరావతి : ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల పాటు జరిగిన శాకంబరి ఉత్సవాలు (Shakambari festival ) పూర్ణాహుతి (Purnahuti) తో ఆదివారం ముగిసాయి. ఆషాడ మాసం (Aashadam) సందర్భంగా అమ్మవారికి మహిళలు సారె సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు ఇంటి నుంచి బోనాలతో బయలుదేరి అమ్మవారికి సారె, నైవేద్యం సమర్పించారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని భక్తులు ప్రార్థించారు.
ముగింపు రోజున అర్చకులు సప్తశతి హవనం, మహా విద్యా పారాయణం, శాంతి పౌష్టికా హోమం, కూష్మాండ బలి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా గర్భగుడిని, ఉప ఆలయాలను కూరగాయలు, పండ్లతో అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు ‘కదంబం’ ప్రసాదాన్ని అందించారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి కె. రామారావు (Temple EO Ramarao) పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈనెల 19న ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారం ముగిసాయని, సుమారు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆయన వివరించారు. నిర్వాహకులు ముగింపు రోజున నిర్వహించిన గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Ream more :
Srisailam | శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన శ్రీశైలం భ్రమరాంబ..!
Tirumala | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.25 కోట్లు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

