TTD | శ్రీవారి భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాన్ని అందించాలి : టీటీడీ ఈవో
TTD | తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో జె శ్యామల రావుఅధికారులను ఆదేశించారు.
తిరుపతి : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో జె శ్యామల రావు (TTD EO Shyamala Rao) అధికారులను ఆదేశించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలను బుధవారం ఈవో సమీక్షించారు. తిరుమల (Tirumala) లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, విక్యూసీలోని అక్షయ కిచెన్, పీఏసీ 2తో పాటు, ఉద్యోగుల క్యాంటీన్, పద్మావతి అతిథి గృహం సహా తిరుమలలో అన్నప్రసాదాలు (Annapradadam) తయారు చేసే ప్రదేశాలను ఆయన సమీక్షించారు.
పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి, తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్యం వంటశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. తిరుమల, తిరుపతిలతో కలిపి రోజుకు సగటున 1. 92 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారని అధికారులు ఈవోకు వివరించారు. ఒక రోజున అన్నప్రసాదం కోసం రూ.38 లక్షలు ఖర్చు అవుతుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా కూరగాయల దాతలు, ఒకరోజు విరాళం పథకం తదితర అంశాలపై కూడా ఈవో సమీక్షించారు. భక్తులకు అందజేస్తున్న మజ్జిగలో నాణ్యత పెంచాలని, వంట చేసే స్థలంలో ఆవరణను పరిశుభ్రంగా, పొడిగా ఉంచాలని అధికారులకు సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

