ఇష్టపూర్వక వివాహమే… సృజనది ఆత్మహత్య కాదు.. సోదరుడు విజయ్
వధువు సృజనకు ఈ పెళ్లి ఇష్టమే లేదు. ఈ పెళ్లిపై అయిష్టతతోనే ఆత్మహత్య చేసుకుంది. గన్నేరు పప్పు తినడంతో అది విషమైందని…. ఇట్లా…. రకరకాల విషయాలు వార్తలయ్యాయి. ఇవన్నీ ఒట్టి పుకార్లని సృజన సోదరుడు విజయ్ స్పష్టం చేశారు. సృజన ఆత్మహత్య చేసుకుందన్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. అలాగే.. ఈ పెళ్లి కూడా ఆమె ఇష్ట ప్రకారమే జరిగిందని వెల్లడించారు.
సృజన మృతిపై సోదరుడు విజయ్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సంబంధం ఆమె ఇష్ట ప్రకారమే కుదుర్చామని, ఈ సంబంధం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందన్న వార్తలు తప్పని పేర్కొన్నారు. అయితే పెళ్లి సమయంలో రుతుక్రమ సమస్య రాకూడదని, ఆమె రుతుక్రమానికి సంబంధించిన మాత్రలు వాడిందని, ఆ కారణంగానే ఆమెకు అనారోగ్య సమస్యలు వచ్చాయని వెల్లడించారు.
ఆమె ఇష్టప్రకారమే ఈ పెళ్లి కుదిరింది. మేం బంధువులం కూడా. సృజన మృతిపై ఇరు కుటుంబాల్లో కూడా ఎలాంటి అనుమానాలు లేవు. మీడియా తనకు ఇష్టం వచ్చిన వార్తలను రాసేస్తోంది. సృజన హఠాన్మరణానికి మాకు కూడా కారణం తెలియదు. పోస్ట్‌మార్టం రిపోర్టు వస్తేనే తెలిసేది. ఈ హఠాన్మరణంతో ఇరు కుటుంబాలు కూడా షాక్‌లోనే వున్నాయి. అని సోదరుడు విజయ్ పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- bride death
- vishakha
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

