సింహాద్రి NTPC వ్యర్థాలపై అధ్యయనానికి కమిటీ వేసిన ఎన్జీటీ
Simhadri NTPC: సింహాద్రిలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నుంచి వచ్చే వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు జరుగుతుందనే అంశంపై అధ్యయనానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్

న్యూఢిల్లీ: సింహాద్రిలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నుంచి వచ్చే వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు జరుగుతుందనే అంశంపై అధ్యయనానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ ఓ కమిటీని నియమించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖ జిల్లా కలెక్టర్లతో సంయుక్త కమిటీ వేసింది. విద్యుత్ కేంద్రాన్ని స్వయంగా సందర్శించి నివేదిక రూపొందించాలని ఆదేశించింది.
సింహాద్రి NTPC పై పర్యావరణ క్లియరెన్స్, వాయు, నీరు, నేల కాలుష్యం, వ్యవసాయానికి జరిగిన నష్టం, సీఎస్ఆర్ నిధుల అమలు తదితర షరతులు పాటించకపోవడం లాంటి ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ అంశాలన్నింటిపైన విచారణ జరిపి నివేదిక అందించాలని కమిటీని ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణలోగా కనీసం మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరింది. పర్యావరణం, వ్యవసాయ నష్టానికి పర్యావరణ పరిహారాన్ని అంచనా వేయాలని ఎన్జీటీ తన ఆదేశాల్లో పేర్కొన్నది. దీనిపై తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

