Pawan Kalyan | నెంబర్ ప్లేట్ లేని వాహనంపై వచ్చి బెదిరిస్తున్నారు : పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్
Pawan Kalyan | తన సభలకు రావడం కాదని.. వచ్చే ఎన్నికల్లో తనకు అండగా ఉండాలని, అసెంబ్లీకి పంపించాలని ఏపీ ప్రజలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై విరుచుకుపడ్డారు.
Pawan Kalyan | తన సభలకు రావడం కాదని.. వచ్చే ఎన్నికల్లో తనకు అండగా ఉండాలని, అసెంబ్లీకి పంపించాలని ఏపీ ప్రజలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై విరుచుకుపడ్డారు.
ఏపీ సీఎం జగన్‌కు క్రిమినల్స్ అండగా ఉన్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. జగన్ దోపిడీదారుడు.. నేరస్తుడని అన్నారు. 2009లోనే తాను పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి ఉంటే జగన్‌ను రానిచ్చేవాడిని కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల బలం ఉందనే అహంకారంతో తాను ఓడిపోయానని నోటికొచ్చినట్లు మాట్లాడారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడికి నోటిదూల ఎక్కువైందని మండిపడ్డారు. డెకాయిట్ ద్వారంపూడికి బుద్ధి చెప్పాలనే కాకినాడ వచ్చానని స్పష్టంచేశారు.
స్థానిక ఎమ్మెల్యేలపై తనకు కోపం లేదని చెబుతూనే కౌన్ కిస్కాగాళ్ల గురించి పట్టించుకోనని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. కౌన్ కిస్కా అన్నందుకు క్షమించాలని ప్రజలను కోరారు. సీఎం జగన్ అండ చూసుకుని ఎమ్మెల్యే ద్వారంపూడి రెచ్చిపోతున్నాడని మండిపడ్డారు. కాకినాడ నడిబొడ్డు నుంచి ద్వారంపూడికి చెప్తున్నా ఇంకోసారి కులదూషణతో రెచ్చగొట్టేలా చేస్తే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు. తాను కోరుకుంటున్నది రాష్ట్ర ప్రజల సంక్షేమమని.. కులాల మధ్య చిచ్చు పెట్టవద్దని హితవు పలికారు. రౌడీ, గుండా, లూటీదారుడు ద్వారంపూడికి చెప్తున్నా.. కాకినాడలో నిన్ను గెలవకుండా చేస్తానని సవాలు విసిరారు.
అధికారంలోకి వచ్చాక వీధుల్లో తరుముతా
ఏ గుండా గాడు వచ్చినా.. కాకినాడ ప్రజలకు తన ప్రాణం అడ్డు వేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒక ఎంపీ కొడుకు, భార్యను కిడ్నాప్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఒక వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేస్తే దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు. రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని సీరియస్ అయ్యారు. నెంబర్ ప్లేట్ లేని వాహనంపై వచ్చి తనను కూడా బెదిరిస్తున్నారని తెలిపారు. తనకు అధికారం వచ్చిన తర్వాత వాళ్లను వీధుల్లో తరుముకుంటూ తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

