వైసీపీలో విభేదాలు.. చైర్మన్ పదవి ఇవ్వలేదని కౌన్సిలర్ రాజీనామా

అమరావతి : కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీలో అధికార వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. తనకు చైర్మన్ పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నాలుగో వార్డు కౌన్సిలర్ జ్ఞాన ప్రసూన తన పదవికి రాజీనామా చేశారు. తనకు చైర్మన్ పదవి ఇస్తానని మాట ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డి మాట తప్పారని ఆమె ఆక్షేపించారు. ఎమ్మెల్యే డబ్బులకు అమ్ముడుపోయారని ఆమె మండిపడ్డారు.. డబ్బు ఇస్తే ఎవరికైనా పదవి ఇస్తారా? అని ఆమె నిలదీశారు. బీసీలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయ్యింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

