కాంట్రాక్ట్ లెక్చరర్లకు న్యాయం చేస్తాం.. ఆదిమూలం సురేశ్
కాంట్రాక్ట్ లెక్చరర్లకు న్యాయం చేస్తాం | కాంట్రాక్ట్ లెక్చరర్లకు అన్యాయం జరుగనివ్వమని ఏపీ మంత్రి ఆదిమూలం సురేశ్ స్పష్టం చేశారు.

అమరావతి: రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఎటువంటి అన్యాయం జరుగనివ్వమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేశ్ హామీ ఇచ్చారు. పలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యా సంస్థలు తమ సంస్థలతోపాటు లెక్చరర్లను ప్రభుత్వానికి హ్యాండోవర్ చేశాయని సోమవారం మీడియాకు చెప్పారు. కుటుంబాలపై ఎటువంటి భారం పడకుండా వారి పిల్లలకు నాణ్యతతో కూడిన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు.
అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాల మాదిరిగానే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తామని ఆదిమూలం సురేశ్ చెప్పారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యా సంస్థల పరిస్థితిపై అధ్యయనానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ సిఫారసుల మేరకు సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి మూడు ప్రతిపాదనలు చేశారన్నారు. సంబంధిత విద్యా సంస్థలు స్వచ్ఛందంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ బెనిఫిట్లను ఉపసంహరించుకోవడం గానీ, ప్రభుత్వానికి అప్పగించడం గానీ, ప్రైవేట్ విద్యా సంస్థలుగా నిర్వహించుకోవడం గానీ చేయొచ్చునని సూచించారని ఆదిమూలం సురేశ్ చెప్పారు.
133 డిగ్రీ కళాశాలల్లో 125 సంస్థలు దాదాపు 93 శాతం సంస్థలు స్వచ్ఛందంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ వదులుకునేందుకు ముందుకు వచ్చాయని, ప్రభుత్వానికి సిబ్బందిని అప్పగించాయని ఆదిమూలం సురేశ్ చెప్పారు. మరో 5-7 విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా తమ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకు వచ్చాయన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

