Vijay Sai Reddy | విజయ్‌సాయిరెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తా : మదన్ మోహన్
Vijay Sai Reddy | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డి (Vijay Sai Reddy) పై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి (Shanti) భర్త మదన్ మోహన్ మానిపట్టి (Madhan Mohan Manipatty) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
Vijay Sai Reddy : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డి (Vijay Sai Reddy) పై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి (Shanti) భర్త మదన్ మోహన్ మానిపట్టి (Madhan Mohan Manipatty) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్న మరో వ్యక్తితో కలిసి విజయ్ సాయిరెడ్డి తన భార్య శాంతిని లోబర్చుకున్నారని, వారు ఆమెతో అక్రమంగా ఒక బిడ్డను కూడా కన్నారని ఆరోపించారు.
తన భార్య ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నదని, ఆమెను విజయసాయిరెడ్డి లొంగ దీసుకున్నాడని మదన్ మోహన్ చెబుతున్నారు. వాళ్లు తన భార్యను లోబర్చుకోవడం మాత్రమే చేయలేదని, పెద్ద ఎత్తున చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేశారని ఆరోపించారు. వాళ్లు పెద్ద నేరం చేశారని విమర్శించారు.
విజయ్ సాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని, ఆయనకు డీఎన్ఏ టెస్టు నిర్వహించాలని మదన్ మోహన్ డిమాండ్ చేశారు. లేదంటే ఆయనకు వ్యతిరేకంగా తాను ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన చేస్తానని హెచ్చరించారు. ఈ విషయమై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని మదన్ మోహన్ చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

