AP News | పైశాచిక ఆనందం.. భార్య ఉరిని చిత్రీకరించిన భర్త
Nellore | ఓ భర్త తన భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సింది పోయి.. ప్రోత్సహించాడు. భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనను చిత్రీకరించి ఆమె బంధువులకు వాట్సాప్‌లో పంపాడు. ఈ

నెల్లూరు : ఓ భర్త తన భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సింది పోయి.. ప్రోత్సహించాడు. భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనను చిత్రీకరించి ఆమె బంధువులకు వాట్సాప్‌లో పంపాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. ఆత్మకూరుకు చెందిన పెంచలయ్య, కొండమ్మ దంపతులు. వీరి మధ్య గతకొంత కాలం నుంచి గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొండమ్మ.. భర్త కళ్లెదుటే ఉరేసుకుని చనిపోయింది. కానీ భర్త ఆపకుండా.. ఆమెను ప్రోత్సహించాడు.
ఆ ఘటనను చిత్రీకరించిన పెంచలయ్య.. వాట్సాప్‌లో కుటుంబ సభ్యులకు పంపాడు. ఈ ఘటనపై కొండమ్మ బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండమ్మ మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పని చేస్తోంది. పైశాచిక భర్త పెంచలయ్యపై చర్యలు తీసుకోవాలని మెప్మా సిబ్బంది పోలీసులను డిమాండ్ చేశారు. పెంచలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

