Former MLA resigns | జగన్‌కు ఝలక్.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రాజీనామా
Resign | ఆంధ్రప్రదేశ్‌లో నిన్న, మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నిన్న, మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీకి చెందిన కొందరు పెద్దల వైఖరి నచ్చక పార్టీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే(Former MLA) కిలారి రోశయ్య (Kilari Roshaiah) బుధవారం వైసీపీ(YCP) పార్టీకి రాజీనామా చేశారు.
ఈ మేరకు గుంటూరులో అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయన అనుచరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీకి నష్టం చేసే వారికి వైసీపీలో ప్రమోషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీ పెద్దలు తనను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం వల్ల , పార్టీలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (Ummadi Venkateshwarlu) అనుభవాన్ని గత ఎన్నికల్లోనూ, ప్రస్తుతం కూడా ఆయనను పరిగణనలోకి తీసుకోవడంలేదని మండిపడ్డారు. మండలిలో ప్రతిపక్ష నేత విషయంలో కనీసం చర్చిందలేదని, ప్రతిపక్షనేతగా కూడా ఉమ్మారెడ్డికి అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. త్వరలో తన భవిష్యత్‌ను ప్రకటిస్తానని వెల్లడించారు.
Read more :
Vijay Sai Reddy | విజయ్‌సాయిరెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తా : మదన్ మోహన్
Chanda Babu | ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్‌శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

