జవాద్ తుఫాన్ హెచ్చరికతో విశాఖలో కంట్రోల్ రూంల ఏర్పాటు

అమరావతి : ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారి భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ, విపత్తు శాఖల హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తుగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. విశాఖలోనో కలెక్టరేట్లో ప్రజలకు అందుబాటులో అత్యవసర సేవలకు గాను కంట్రోల్ రూం నెంబర్లను ప్రకటించింది. 08912590100, 08912590102, 08912750089, 0891 2750090, 08912560820లకు ఫొన్ చేయాలని బాధితులకు సూచించింది.
కాగా తాజా సమాచారం మేరకు జవాద్ తుఫాన్ విశాఖకు ఆగ్నేయంగా 420 కి. మీ దూరంలో, ఒడిశా గోపాల్‌పూర్‌కు 530 కి.మీ, పారాదీప్‌కు 650 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్ర తీరానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గంటకు 25 కి.మీ వేగంతో ఉత్తర కోస్తాంధ్ర వైపు జవాద్ తుఫాన్ దూసుకొస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఉత్తర కోస్తాంధ్ర ఒడిశా తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగింది.
శీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ జిల్లాలో 20 సెంటి మీటర్లకు పైగా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, లో తట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

