RGV | ఒంగోలు పోలీస్‌స్టేషన్‌కు రాంగోపాల్ వర్మ.. ఫొటోల మార్ఫింగ్ కేసులో విచారణ..!
RGV | ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒంగోలు పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఆర్జీవీని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు విచారిస్తున్నారు. మార్ఫింగ్ ఫొటోలు పెట్టిన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఆర్జీవీని పోలీసులు విచారిస్తున్నారు.
RGV | ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒంగోలు పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఆర్జీవీని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు విచారిస్తున్నారు. మార్ఫింగ్ ఫొటోలు పెట్టిన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఆర్జీవీని పోలీసులు విచారిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేశ్ మార్ఫింగ్ ఫొటోలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ముగ్గురు నేతల ఫొటోలను డైరెక్టర్ రాంగోపాల్ శర్మ మార్ఫింగ్ చేసినట్లుగా టీడీపీ నేత రామలింగం ఒంగోలు జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్జీవీకి నోటీసులు పంపారు. అయితే, కేసును కొట్టివేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా ఈ నెల 4న విచారణకు రావాలని పోలీసులు మళ్లీ నోటీసులు ఇవ్వగా.. 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ మేరకు రాంగోపాల్ వర్మ ఒంగోలు పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Meenakshi Chaudhary | పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి.. !
INDIA alliance | డీలిమిటేషన్ బిల్లు వేళ కాంగ్రెస్ హై కమాండ్ కీలక నిర్ణయం.. స్టాలిన్, పవార్‌తో చర్చించనున్న ఇండియా కూటమి నేతలు
US Accident | అమెరికాలో ప్రమాదం.. జలపాతంలో పడి టీడీపీ నేత కుమారుడి మృతి
Nani | నాని కోసం గొడుగు పట్టిన నితిన్.. ‘అలియాస్ రుక్మిణీ’ ఈవెంట్లో బయటపడిన పాత సీక్రెట్!
AR Rahman | ‘రాక్‌స్టార్’ పాటలు నచ్చలేదని 8 నెలలు రెమ్యూనరేషన్ ఆపేశారు : ఏఆర్ రెహమాన్ !
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

