YS Sharmila | ఏపీలో పెట్రోల్,డీజిల్‌పై 31 శాతం అధిక వ్యాట్ వసూలు సిగ్గుచేటు : వైఎస్ షర్మిల
YS Sharmila | దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ,డీజిల్ పై వసూలు చేస్తున్న 31 శాతం అధిక వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
అమరావతి : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ( Petrol ) ,డీజిల్ ( Diesel ) పై వసూలు చేస్తున్న 31 శాతం అధిక వ్యాట్ ( VAT ) ను వెంటనే తగ్గించాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila) డిమాండ్ చేశారు. అత్యధిక ఇంధనం ధరలు ఏపీలో ఉన్నాయని ట్విటర్ వేదికలో ఆరోపించారు.
ఏపీ రోల్ మోడల్ అంటే వ్యాట్ పేరుతో జనాలను బాదడమా అంటూ ప్రశ్నించారు. లీటర్ ధర మీద అదనంగా రూ.4 గుంజడంపై నియంత్రణ ఎందుకు లేదని అన్నారు. పొదుపు చర్యలు ప్రజలకేనా.. పన్నులు తగ్గించడంలో ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నిలదీశారు. అభివృద్ధిలో చివరిస్థానం, ఇంధనం ధరల్లో మొదటి స్థానం ఉన్నందుకు సిగ్గుపడాలని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.77 పైసలుండగా, అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 113. 62 పైసలుందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో లీటర్ డీజిల్ ధర రూ . 93.75 పైసలుండగా ఎన్డీయేలో పెద్దన్న పాత్ర పోషించే రాష్ట్రం ఏపీలో డీజిల్ ధర రూ 101.24 పైసలుండడం దారుణమని అన్నారు.
పక్కరాష్ట్రం తమిళనాడుతో పోల్చినా రూ. 10 రూపాయలు అదనంగా ఏపీలో చమురు ధరలున్నాయని విమర్శించారు. కర్ణాటకతో రూ . 7, తెలంగాణ, కేరళతో చూసినా రూ. 4 రూపాయలు ధరాభారం అధికంగా ఉందని ఆరోపించారు. అధిక వ్యాట్ , అడిషనల్ వ్యాట్ పేరుతో ఏటా ప్రజలపై పడుతున్న 10 వేల కోట్లు అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. ఆదాయం పెంపు మార్గాలని 2014 నుంచి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ముక్కుపిండి వసూలు చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పడే భారాన్ని మోదీ మెడలు వంచి తీసుకు రావాలని సీఎం చంద్రబాబుకు సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Diesel
- Exorbitant
- Petrol
- vat
RELATED ARTICLES
తాజా వార్తలు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
సామాన్యుడిపై మరో పిడుగు.. పెరగనున్న సబ్బులు, వంటనూనెల ధరలు
Congress | ‘పట్టభద్రుల’ భయంలో కాంగ్రెస్ సర్కార్.. హైదరాబాద్‌లో నిరసన రద్దు.. ఢిల్లీకి పరుగు
KTR | కేటీఆర్‌తో యువ న్యాయవాదుల భేటీ.. సామాన్యులకు న్యాయం కోసం నిబద్ధతతో పనిచేయాలని లాయర్లకు పిలుపు
Tummidihatti Barrage | ‘తమ్మిడిహట్టి’పై ‘మహా’ సస్పెన్స్.. 152 మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ ఓకే చెప్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

