CNG Gas leak | కోనసీమ జిల్లాలో సీఎన్జీ గ్యాస్ లీక్..సమీప ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు
CNG Gas leak | ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక వద్ద సీఎన్జీ మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ అయింది.
అమరావతి : ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ (Konaseema ) జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక వద్ద సీఎన్జీ మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ (CNG gas leak) అయింది.దీంతో ముందుజాగ్రత్తగా కిలో మీటర్ పరిధిలోని రెండు వందల కుటుంబాలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మూసివేసిన ఓఎన్జీసీ రీ డ్రిల్లింగ్ పాయింట్ నుంచి రీ డ్రిల్లింగ్ చేస్తుండగా భారీ శబ్దంతో గ్యాస్ వెలువడింది. దీనితో పాటు భారీ శబ్దాలు వచ్చాయి. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకుని ఓఎన్జీసీ నిపుణులు చర్యలు చేపట్టారు.గ్యాస్ చుట్టుపక్కల గ్రామాలకు విస్తరిస్తుండడంతో స్థానికులు ఆందోళనకు గురువుతున్నారు. జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్, ఎస్పీ రాహుల్ మీనా ఘటనా, సంబంధిత ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
బావి వద్ద మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది యత్నిస్తున్నారు. గ్యాస్ బ్లోఅవుట్ చుట్టూ మంటలు వ్యాపించకుండా వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనిత, మంత్రి అచ్చెన్ననాయుడు స్పందించారు. యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.కొన్ని అనుభవం లేని కంపెనీలకు ఓఎన్జీసీ పనులు అప్పగించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఎమ్మెల్యే సత్యనారాయణ మండిపడ్డారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CNG Gas leak | కోనసీమ జిల్లాలో సీఎన్జీ గ్యాస్ లీక్..సమీప ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు
ఓపీఎస్‌కే మన ఓటు.. భద్రాద్రి కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ధర్నా
Vera Dijkmans | అమెరికా అధికారుల అదుపులో ప్రపంచ మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్ వెరా డిజ్క్మాన్స్..!
Jagadish Reddy | కేసీఆర్ ఇచ్చిన కరెంటు, నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు : కాంగ్రెస్ మేనిఫెస్టోపై జగదీష్ రెడ్డి
‘కాంగ్రెస్ దొంగ హామీలకు నేటితో మూడేళ్లు’
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

