Janga Krishnamurthy | ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఊరట.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
Janga Krishnamurthy | ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. తనపై వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ జంగా కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయొద్దని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.
Janga Krishnamurthy | ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. తనపై వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ జంగా కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయొద్దని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.
వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన జంగా కృష్ణమూర్తి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. దీంతో ఫార్టీ ఫిరాయించినందుకు గానూ ఆయనపై వేటు వేయాలని అప్పటి విప్ అప్పిరెడ్డితో పాటు వైసీపీకి చెందిన పలువురు సభ్యులు మండలి చైర్మన్ మోషెన్ రాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో జంగా కృష్ణమూర్తి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారని.. ఇది కక్షపూరిత చర్య అని హైకోర్టులో పిటిషన్ వేశారు. పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేల మీద ఏళ్ల తరబడి చర్యలు తీసుకోకుండా తనపై మాత్రం వేటు వేయడమేంటని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. జంగా కృష్ణమూర్తి స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని ఈసీకి సూచించింది.
ఎమ్మెల్సీ ఇందుకూరి రాజాపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని ఈసీకి ఏపీ హైకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసనమండలి చైర్మన్ మోషెన్ రాజుకు.. విప్ పాలవలస విక్రాంత్ ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజును అనర్హుడిగా ప్రకటిస్తూ ఈ నెల 3వ తేదీన మండలి చైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే చైర్మన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇందుకూరి రాజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇందుకూరి రాజా స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

