ఏపీలో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల సీఎస్ల భేటీ.. పెండింగ్ సమస్యలపై కీలక చర్చ!
ఏపీలో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలపై మంగళగిరిలోని ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా విజయవాడకు వెళ్లారు.
ఏపీలో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలపై మంగళగిరిలోని ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా విజయవాడకు వెళ్లారు. ఏపీ సీఎస్ నీరభ్‌కుమార్, తెలంగాణ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు సమావేశమై.. పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే అజెండాగా ఇరు రాష్ట్రాల సీఎస్ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల ఆస్తుల పంపకంపై ప్రధానంగా చర్చించనున్నారు. వీటితో పాటు విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పంపకంపై అధికారుల కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. 2024 జూలై 5 తేదీన సీఎంల సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై అధికారులు లోతుగా చర్చించే అవకాశం ఉందని సమాచారం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

