Murder | ఏపీలో ఆగని హత్యల పరంపర.. నడిరోడ్డుపై మరొకరి దారుణ హత్య..!
Murder | ఆంధ్రప్రదేశ్‌లో హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అక్కడ జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాజకీయ కక్షలతో పట్ట పగలు, నడిరోడ్లపై అందరూ చూస్తుండగానే పరస్పరం హత్యలకు పాల్పడుతుండటంతో జనం భయకంపితులవుతున్నారు.
Murder : ఆంధ్రప్రదేశ్‌లో హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అక్కడ జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాజకీయ కక్షలతో పట్ట పగలు, నడిరోడ్లపై అందరూ చూస్తుండగానే పరస్పరం హత్యలకు పాల్పడుతుండటంతో జనం భయకంపితులవుతున్నారు. ఇవాళ మరో వ్యక్తి పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు.
వినుకొండలో రషీద్ హత్య ఘటనను మరువకముందే ధర్మవరం మండలం కొత్తకోటలో మరో మర్డర్ జరిగింది. వెల్దుర్తి గ్రామానికి చెందిన సూర్య నారాయణ అనే వ్యక్తిని నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు. అయితే ఈ హత్య ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..? అనే వివరాలు మాత్రం బయటికి రాలేదు.
కాగా, హత్యల్లో ఆంధ్రప్రదేశ్ బీహార్‌ను తలపిస్తున్నదని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్నది. కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్‌ని గాలికి వదిలేయడంతో ఇష్టారాజ్యంగా రౌడీలు రెచ్చిపోతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా ఈ నెల 24న ఢిల్లీలో ఆందోళనకు దిగేందుకు సిద్ధమయ్యారు. జాతీయ స్థాయిలో టీడీపీ రాజకీయ దాడులను ఎండగడతామని అంటున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

