AP News | మస్కట్ నుంచి తిరిగొస్తూ.. బస్సులోనే ప్రాణాలు విడిచిన మహిళ
AP News | గల్ఫ్ ఆశలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లిన ఓ మహిళ పడరాని పాట్లు పడి.. ఆ వేధింపులు తాళలేక తిరిగొస్తూ మరణించింది. హైదరాబాద్ నుంచి తణుకు వెళ్తుండగా బస్సులోనే గుండెపోటుతో మృతిచెందింది. ఏపీలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
AP News | గల్ఫ్ ఆశలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లిన ఓ మహిళ పడరాని పాట్లు పడి.. ఆ వేధింపులు తాళలేక తిరిగొస్తూ మరణించింది. హైదరాబాద్ నుంచి తణుకు వెళ్తుండగా బస్సులోనే గుండెపోటుతో మృతిచెందింది. ఏపీలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన బొంతా సత్యపద్మకు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన ప్రభాకర్‌తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో భర్తకు చేదోడువాదోడుగా ఉండటానికి సత్య పద్మ ఏదైనా పనిచేయాలని అనుకుంది. ఈ క్రమంలోనే మస్కట్‌కు వెళ్లేందుకు రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బుతో పాటు.. మరికొంత అప్పు తీసుకొచ్చి మొత్తం 2 లక్షల రూపాయలను విజయవాడకు చెందిన ఓ మహిళా ఏజెంట్‌కు ఇచ్చింది. ఆ తర్వాత ఏజెంట్ ఆమెను మస్కట్ పంపించింది.
కానీ మస్కట్‌కు వెళ్లిన తర్వాత పని అనుకున్నట్లుగా లేదు. అక్కడి యజమానులు సత్య పద్మను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. అధికంగా పని చెప్పడంతో పాటు రెస్ట్ ఇవ్వకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆంధ్రాకు తిరిగి వెళ్లిపోతానని ఆమె అక్కడి యజమానులకు మొరపెట్టుకుంది. ఏజెంట్‌ను కూడా ఎంతగానో బతిమిలాడుకుంది. కానీ ఎవరూ వినిపించుకోలేదు. మరో రెండు లక్షలు ఇస్తేనే ఇండియాకు వచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దీంతో ఏపీలో ఉన్న భర్త ప్రభాకర్ ఏజెంట్‌కు రెండు లక్షలు చెల్లించాడు. ఏజెంట్‌కు డబ్బులు పంపించిన తర్వాత తన భార్య వారం రోజుల్లో ఇంటికి వస్తుందని ఆశపడ్డాడు.
డబ్బులు చెల్లించిన తర్వాత సత్యపద్మ ఈ నెల 24వ తేదీన మస్కట్ నుంచి ఇండియాకు బయల్దేరింది. మస్కట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. అక్కడ తణుకు వెళ్లే బస్సు ఎక్కింది. కానీ అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించి ఉండటంతో గుండెపోటుకు గురై బస్సులోనే కన్నుమూసింది. ఇది గమనించిన బస్సు డ్రైవర్, కండక్టర్లు సత్యపద్మ కుటుంబానికి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆమె భర్త కన్నీరుమున్నీరుగా విలపించారు. ఏజెంట్‌కు డబ్బులు చెల్లించిన తర్వాత తన భార్య రాక గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. ఈ నెల 30న పంపిస్తామని చెప్పి 24వ తేదీనే పంపించేశారని తెలిపారు. ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా తమకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- Gulf
- heart attack
- Muscat
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

