Divvela Madhuri | దివ్వల మాధురికి టీటీడీ షాక్.. తిరుమల వన్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదు
Divvela Madhuri | దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమలలో దివ్వెల మాధురిపై కేసు నమోదైంది. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల వన్ టౌన్ పోలీసులు మాధురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Divvela Madhuri | దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమలలో దివ్వెల మాధురిపై కేసు నమోదైంది. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల వన్ టౌన్ పోలీసులు మాధురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాధు తిరుమలకు వచ్చినప్పుడు రీల్స్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. శ్రీవారి ఆలయం, పుష్కరిణి వద్ద రీల్స్, ఫొటోషూట్ చేయడం పట్ల టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది టీటీడీ నిబంధనలు, ఆలయ సంస్కృతిని ఉల్లంఘించడమేనని, తమ వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకుంటూ సహజీవనం చేస్తున్నామని చెప్పడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అభిప్రాయపడింది. దీంతో ఆమెపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీటీడీ ఏవీఎస్వో ఎం.మనోహర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దివ్వల మాధురిపై తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల మాడవీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం నిబంధనలకు విరుద్ధమని తిరుమల డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు. అక్కడ పవిత్రమైన శ్రీవారికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలని.. వ్యక్తిగత విషయాలను మాట్లాడటం నిషేధమని పేర్కొన్నారు. ఎవీఎస్వో మనోహర్ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ 292, 296, 300 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

