AP New Districts | ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ఏపీ ప్రభుత్వం రెండు రోజుల్లో జారీ చేయనున్నట్టు సమాచారం.
ఏపీలో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే.. ప్రతి నియోజకవర్గాన్ని ఒక జిల్లా మార్చే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే.. ఏపీని మొత్తం 26 జిల్లాలుగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.