వరుస భూ ప్రకంపనలతో చిత్తూరు జిల్లా వాసుల బెంబేలు..

అమరావతి : ఒకవైపు భారీ వర్షాలు..మరోవైపు భూ ప్రకంపనలు చిత్తూరు జిల్లాను వణికిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నాం నుంచి అర్ధరాత్రి వరకు పలుమార్లు భూమి కంపించింది. జిల్లాలోని పలమనేరు, కరడిమడుగు మండలంలో భారీ శబ్దంతో భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శనివారం మధ్యాహ్నాం కూడా రామకుప్పం మండలం, గడ్డూరు తదితర గ్రామాల్లో భూ ప్రకంపనులు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి భూప్రకంపనలు సంభవించిన గ్రామాల్లో పర్యటించి సమాచారాన్ని సేకరించారు.
వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుండటంతోనే ప్రకంపనలు వచ్చి ఉండవచ్చవని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఆయన పీఏ మనోహర్, స్థానిక టీడీపీ నేతలతో కలిసి భూప్రకంపనలు చోటుచేసుకున్న గడ్డూరు, చిన్నగెరిగెపల్లె, పెద్దగెరిగెపల్లె, గోరివిమాకులపల్లెల్లో పర్యటించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Graduate MLC Elections | పట్టభద్రుల ఓట్లతో కాంగ్రెస్లో గుబులు.. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో భారీగా పెరిగిన ఓట్లు!
Hyderabad CP | కొత్త సీపీ రాకతో పోలీసుల్లో గుబులు.. ఎవరుంటారో.. ఎవరు పోతారో!
Monthly Income Plans | నెలనెలా ఆదాయం కావాలా? మీ డబ్బుకు భరోసా ఇచ్చే టాప్ పెట్టుబడి పథకాలు ఇవే!
Municipal Elections | మున్సి‘పోల్’కు కాంగ్రెస్ వణుకు.. 5 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఎప్పుడో?
Government Orders | అనాలోచితంగా జీవోలు.. ఆపై యూటర్న్లు.. బోరుబావుల తవ్వకాలకు కొత్త వెసులుబాటు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

