గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్
పట్టణంలోని చెంచుకాలనీలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న గుర్రాల అనితను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ వెల్లడించారు.
మందమర్రి, జూలై 17: పట్టణంలోని చెంచుకాలనీలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న గుర్రాల అనితను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ వెల్లడించారు. మందమర్రి పట్టణంలోని విద్యానగర్(చెంచు కాలనీ)కి చెంది న అనిత కొన్ని రోజులుగా విక్రయిస్తున్నది.
అదే కాలనీకి చెం దిన మక్కల గంగాధర్‌తో చంద్రాపూర్ నుంచి రెండు కిలోల గంజాయిని తెప్పించింది. ఆ గంజాయిని వినియోగదారులకు ప్యాకెట్‌కు రూ.300ల చొప్పున అనిత విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బుధవారం ఆమె నివాసంతో చుట్టు పక్కల తనిఖీ చేయగా రూ.25 వేల విలువైన కిలో వంద గ్రాముల గంజాయి లభించింది. గంజాయి విలు వ సుమారు రూ.25 వేలు ఉంటుందని ఆయన చెప్పారు.
గంజాయి విక్రయించగా రూ.27,200 నగదు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని అనితను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ రవికుమార్ తెలిపారు. గంజాయిని అమ్మినా, కొన్నా, సేవించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాకచక్యంగా గంజాయిని పట్టుకు న్న మందమర్రి సీఐ శశీధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ రాము, మహిళా హెడ్ కానిస్టేబుల్ పద్మ, హోంగార్డు ఉమను రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ అభినందించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

