సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుల వినతి
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో నెలన్న సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం కమిషనర్ అన్వేష్‌కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు గాదెసత్యం మాట్లాడుతూ రోడ్డువెడల్పు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు నిదానంగా జరుగుతున్నాయని, దీంతో వ్యాపారులతో పాటు పట్టణ ప్రజలు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు.
మంచిర్యాల టౌన్, జూలై 10: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో నెలన్న సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం కమిషనర్ అన్వేష్‌కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు గాదెసత్యం మాట్లాడుతూ రోడ్డువెడల్పు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు నిదానంగా జరుగుతున్నాయని, దీంతో వ్యాపారులతో పాటు పట్టణ ప్రజలు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. తాగునీటి సరఫరా సరిగా లేదని, చాలా డివిజన్లలో వీధి దీపాలు వెలగడం లేదని, వర్షాకాలంలో చిమ్మచీకట్లలో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు.
చాలా డివిజన్లలో కోతుల బెడద, కుక్కల బెడద తీవ్రంగా ఉన్నదని, పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని, రానున్న సీజనల్ వ్యాధుల సమయంలో పరిస్థితి ఇలాగే ఉంటే వ్యాధులు వ్యాప్తి చెందుతాయన్నారు. వాడల్లో రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి అధ్వానంగా మారాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ సత్తార్, మాజీ కౌన్సిలర్ తోట తిరుపతి, పోరెడ్డి రాజు, నాయకులు పడాల రవీందర్, బల్లికొండ రమేశ్, జాడి భానుచందర్, జక్కం జగన్, బొడ్డు పద్మ, పుప్పాల స్వర్ణాకర్, నక్క తిరుపతి, జావిద్, శ్రీకాంత్, రమేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
Harish Rao | గ్రావిటీతో నీళ్లా.. నిరూపిస్తే రాజీనామా? లేదంటే మీరు చేస్తారా ?.. సర్కార్‌కు హరీశ్ ఓపెన్ చాలెంజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

