ప్రాణం తీసిన దాగుడు మూతలాట
ఓ బాలుడు.. తన తమ్ముడు, చెల్లితో కలిసి దాగుడుమూతలాట ఆడుకుంటుండగా పత్తిలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగింది. కన్నెపల్లికి చెందిన చెన్నూరి కైలాస్-రమా దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు
- పత్తిలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందిన అభిషేక్
కౌటాల, జనవరి 3 : ఓ బాలుడు.. తన తమ్ముడు, చెల్లితో కలిసి దాగుడుమూతలాట ఆడుకుంటుండగా పత్తిలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగింది. కన్నెపల్లికి చెందిన చెన్నూరి కైలాస్-రమా దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. నాలుగో తరగతి చదువుతున్న అభిషేక్ (10)తన తమ్ముడు, చెల్లితో కలిసి సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయానికి వ్యవసాయ పనులకు వెళ్లిన తల్లితండ్రులు ఇంటికి రాలేదు.
అభిషేక్ దాగుడుమూతల ఆట ఆడుకుందామని చెప్పాడు. తమ్ముడు, చెల్లికి చెల్లికి దొరకకూడదని ఇంటిలో నిల్వ ఉంచిన పత్తిలో చిన్న రంధ్రం చేసుకొని అందులోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. ముందు గా తల పెట్టే సరికి కాళ్లు పైకి లేచిసరికి ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. అదే సమయంలో ఇంటికి చేరుకున్న తల్లితండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న అభిషేక్‌ను కౌటాలలోని దవాఖానకు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లితండ్రులతో పాటు పిల్లల రోదనలు అక్కడున్న వారికి కంటతడి పెట్టించాయి.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- Accidentally
- adilabad
- Boy
- death
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

