హైదరాబాద్: డా. బీఆర్ అంబేద్కర్ సావ్రత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జనవరిలో జరగనున్నాయి. డిగ్రీ సెకండియర్ నాలుగో సెమిస్టర్ పరీక్షలు జనవరి 18 నుంచి 21 వరకు, మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు http://www.braou.ac.in పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఆధ్యయన కేంద్రంలో లేదా 23680241/23680254 ఫోన్నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.