కలిసి నడుద్దాం

ఆరోగ్యానికి నడకకు మించిన వ్యాయామం లేదని అందరికీ తెలిసిందే! కానీ, ఒంటరిగా భారంగా అడుగులు వేసిందానికన్నా, నచ్చిన వారితో జంటగా నడిస్తే మరింత ప్రయోజనం ఉందంటున్నారు పరిశోధకులు. అమెరికాకు చెందిన పర్డ్యూ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ సంగతి వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు రోజూ ఒంటరిగా వాకింగ్ చేసే 141 మందితోపాటు కలిసి నడిచే 72 జంటలనూ పరిశీలించారు. వారితో మాట్లాడారు. ఇందులో తేలిందేమిటంటే, ఒంటరిగా వాకింగ్ చేస్తున్నవారి వేగం కంటే జంటగా నడుస్తున్న వారి వేగం తక్కువట. దంపతులు ఊసులు పంచుకుంటూ ఆనందంగా నడవడమే వేగం తగ్గడానికి కారణం. కానీ, ఇలా కబుర్లాడుకుంటూ ఆనందాలు పంచుకోవడం వల్ల వేగం తగ్గినా వారి ఆరోగ్యం హెచ్చుతున్నదని పరిశోధకులు తేల్చారు. “వాకింగ్ మాత్రమే కాదు, వ్యాయామం చేసే సమయంలోనూ జీవిత భాగస్వామి గానీ, స్నేహితులు గానీ తోడుంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. వేరే కసరత్తులు సాధ్యపడకపోయినా వారానికి 150 నిమిషాలు జంటగా వాకింగ్ చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గుతాయ”ని చెబుతున్నారు పరిశోధకుడు రిచర్డ్స్.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మండల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు పురస్కారం
Brutal murder | వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా ప్రారంభమైన సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన
Mysaa | 29 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన వందేమాతరం – సుద్దాల.. ‘మైసా’ నుంచి పవర్ఫుల్ విప్లవ గీతం నేడే!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

