వాక్స్ సాండ్.. నయా ట్రెండ్
ఒత్తయిన చీకట్లో చిట్టి కొవ్వొత్తుల వెలుగు కాంతిని వెదజల్లడంతోపాటు ఇంటికి అందాన్ని అందిస్తుంది. సందర్భం ఏదైనా కొవ్వొత్తులతో కూడిన అలంకరణలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. చీకటిని పారదోలడానికే కాదు ఈమధ్య కొవ్వొత్తులు అలంకరణలోనూ భాగమయ్యాయి. ఇందుకోసం రకరకాల ఫ్లేవర్లు, రంగులు, కస్టమైజ్డ్ కొవ్వొత్తులు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఒత్తయిన చీకట్లో చిట్టి కొవ్వొత్తుల వెలుగు కాంతిని వెదజల్లడంతోపాటు ఇంటికి అందాన్ని అందిస్తుంది. సందర్భం ఏదైనా కొవ్వొత్తులతో కూడిన అలంకరణలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. చీకటిని పారదోలడానికే కాదు ఈమధ్య కొవ్వొత్తులు అలంకరణలోనూ భాగమయ్యాయి. ఇందుకోసం రకరకాల ఫ్లేవర్లు, రంగులు, కస్టమైజ్డ్ కొవ్వొత్తులు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ కొవ్వొత్తుల ట్రెండ్‌ని బీట్ చేస్తూ మార్కెట్లో హల్చల్ చేస్తున్నది వాక్స్ సాండ్. కొవ్వొత్తులను తయారుచేసే మైనంతో చేసిన ఈ సాండ్ చూసేందుకు అచ్చంగా ఇసుకను పోలి ఉంటుంది. దీన్ని అందమైన గ్లాసులు, గిన్నెలు, చిట్టిపొట్టి కుండలు.. ఇలా దేంట్లో అయినా పోసివెలిగించేయడమే.
ఈ మైనపు ఇసుకలో ఠీవిగానిల్చోడానికి ప్రత్యేకంగా తయారు చేసిన వత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సాండ్ కూడా రకరకాల రంగులు, ఫ్లేవర్లలో లభిస్తున్నది. జాస్మిన్, లావెండర్ వంటి గుబాళించే ఫ్లేవర్లతో ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తుంది. ఈ సాండ్ నీటిలో తడవదు, అందువల్ల అందమైన నీటి తొట్టెల్లోనూ దీనిని పోసి దీపాలు పెట్టేయొచ్చు. ఈ మైనపు ఇసుక ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ మీ ఇంటిని అలంకరించుకోడానికి దీన్ని ట్రై చేసేయండి!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

