తలగడను‘కవర్’ చేయండి!

అందం అనగానే ముఖమే గుర్తుకొస్తుంది. మొటిమలు, మచ్చలు ఉంటే చంద్రబింబమైనా అందవిహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యలకు రకరకాల కారణాలు. దిండు కవర్ల అపరిశుభ్రత కూడా వాటిలో ఒకటని నిపుణులు చెబుతారు. నిజానికి, చాలమంది బెడ్షీట్స్ను రెగ్యులర్గా ఉతుకుతుంటారు. కానీ, బెడ్మీది దిండు కవర్లను మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. పండుగకో పబ్బానికో తప్ప ఉతకరు. దిండు కవర్లకు వాడే మెటీరియల్ నాణ్యతనూ పట్టించుకోరు. ఒకే దిండును అవసరాన్నిబట్టి కుటుంబమంతా వాడుతుంటారు. దీంతో అంటురోగాలు విస్తరిస్తాయి. చుండ్రుకూడా వ్యాపిస్తుంది. చుండ్రు ముఖానికి తగిలినప్పుడు మొటిమల వంటి చర్మసమస్యలూ మొదలవుతాయి. అందువల్ల బెడ్షీట్స్తోపాటు దిండు కవర్లను కూడా రెండ్రోజులకోసారి యాంటీ సెప్టిక్ సొల్యూషన్తో శుభ్రం చేయాలి. సాధ్యమైనంత వరకూ కాటన్ కవర్లనే ఎంచుకోవాలి. సింథటిక్ ఫైబర్ పదార్థాలవల్ల అలర్జీలు త్వరగా వ్యాపిస్తాయి. ఇంట్లో ఆస్తమా పేషెంట్లు ఉన్నప్పుడు వాళ్లకు వేరుగా దిండ్లు ఉండాలి. దిండును కవర్లు లేకుండా వాడొద్దు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- pillow
- sleep pillow
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

