సెకండ్ హ్యాండ్ ‘స్ట్రెస్’

వస్తువుల్లో సెకండ్ హ్యాండ్ ఉంటాయి. ఒత్తిడిలోనూ ఉంటుందా? అంటే, ఉంటుందనే చెబుతున్నారు మానసిక నిపుణులు. నేరుగా మనం తలకెక్కించుకొనే ఒత్తిళ్లు చాలానే ఉంటాయి.. పనికి సంబంధించి, అనుబంధాలకు సంబంధించి, ఆర్థిక సమస్యలకు సంబంధించి. ఇవన్నీ ‘ఫస్ట్ హ్యాండ్’ ఒత్తిడులు. చాలా సందర్భాల్లో .. మిత్రులూ, సహోద్యోగులు, బంధువుల ప్రవర్తన కారణంగా కూడా ఒత్తిడికి గురవుతుంటాం. నిజానికి సమస్య మనది కాదు. కానీ, మనదికాని చెత్తనంతా మన మెదడులోకి తోసేసుకుంటాం. మానసికవేత్తలు ఈ ధోరణికి పెట్టినపేరే ‘సెకండ్ హ్యాండ్ స్ట్రెస్’. ఆ భారాన్ని వదిలించుకోవాలంటే, మూల కారణం ఎవరో తెలుసుకోవాలి. సాధ్యమైనంత వరకూ వాళ్లకు దూరంగా ఉండాలి. లేదంటే, బుర్రను ఖరాబు చేసే చర్చలు పెట్టవద్దంటూ ముందే షరతు విధించాలి. అన్నిటికీ మించి, ప్రతిదీ మనసులోకి తీసుకోవడం మానేయాలి. ఆ ప్రయత్నంలో ధ్యానం ఉపయోగపడుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- second hand
- stress
- things
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

