పోషకాలతో.. క్యాన్సర్‌పై పోరాటం!

క్యాన్సర్ ఉందంటే, ఇక రోజులు లెక్కబెట్టాల్సిందే అనుకునేవారు. కానీ ఇప్పుడు, వైద్యరంగంలో సాంకేతికత అభివృద్ధి చెందుతున్నది. వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, రోగి జీవితకాలాన్ని పెంచుతున్నారు డాక్టర్లు. కొన్ని కేసుల్లో క్యాన్సర్ కణితులను తొలగించి, పూర్తి ఆరోగ్యవంతులను చేస్తున్నారు. వైద్యంతోపాటు, మనం తీసుకునే ఆహారం కూడా క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది.
పండ్లు – కూరగాయలు
అన్నిరకాల పండ్లు, కూరగాయలు తినాలి. వాటిలోని ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్‌తో పోరాడుతాయి. వీటిలోని విటమిన్స్, మినరల్స్ క్యాన్సర్ నివారణలో తోడ్పడతాయి. ముఖ్యంగా సల్ఫోరఫేన్ ఎక్కువగా ఉండే క్యాలీఫ్లవర్, క్యాబేజి, బ్రకోలి తరచూ తీసుకోవాలి. ఇవి క్యాన్సర్ కణితుల పరిమాణాన్ని తగ్గించి, కణాల వృద్ధిని తగ్గిస్తాయి. పండ్లలో సిట్రస్ జాతికి చెందినవి బాగా తినాలి.
మసాలా దినుసులు
భారతీయ వంటగదిలో తప్పనిసరిగా ఉండే దినుసులు దాల్చిన చెక్క, జీలకర్ర. వీటిలో యాంటీ క్యాన్సర్ గుణాలు అపారం. అలాగే పసుపులోని కర్క్యుమిన్ కాంపౌండ్ క్యాన్సర్‌తో పోరాడుతుంది.
టమాట
ఎర్రటి టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. అయితే, టమాటాను ఉడికించుకుని తింటేనే మంచి ఫలితాలు ఉంటాయి. వాటిని వండినప్పుడే లైకోపీన్ విడుదల అవుతుంది.
వెల్లుల్లి
ఇందులోని అల్లీసిన్ అనే కాంపౌండ్ క్యాన్సర్‌ను ఎదుర్కొంటుంది. అల్లీసిన్ కాంపౌండ్ కాలేయం, రొమ్ము వంటి అవయవాలపై దాడి చేసే నిట్రోసమైన్ను అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వెల్లుల్లి విడుదల చేసే సల్ఫర్ పదార్థాలు క్యాన్సర్ కణాలను నివారిస్తాయి.
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్,
Mayuri@trudiet.in
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Cancer
- Proteins food
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Rakesh Reddy | నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డిది.. ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

