ఎగ్ 65

కావలసిన పదార్థాలు: గుడ్లు: మూడు, మైదా: అర కప్పు, కార్న్‌ఫ్లోర్: పావు కప్పు, పెరుగు: అర కప్పు, అల్లం: అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, పచ్చిమిర్చి: నాలుగు, కారం: ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా: ఒక టీ స్పూన్, బ్రెడ్ క్రంబ్స్: కొద్దిగా, కరివేపాకు: రెండు రెబ్బలు, కొత్తిమీర తురుము: ఒక టేబుల్ స్పూన్, చక్కెర: చిటికెడు, చిల్లీసాస్: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా
తయారీ విధానం: ముందుగా రెండు గుడ్లను ఉడకబెట్టి వాటిలోని తెలుపు భాగాన్ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని ఒక పాత్రలోకి తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, కారం, తరిగిన అల్లం ముక్కలు, గరం మసాలా, బ్రెడ్ క్రంబ్స్, పిండి వేసి కలపాలి. ఇందులో గుడ్డు కొట్టి, ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా కలియబెట్టాలి. కడాయిలో నూనె వేడయ్యాక మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ నూనెలో వేయాలి. గోధుమరంగులోకి మారేవరకు వేయించి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై గిన్నెపెట్టి కాస్త నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. కాసేపు వేగిన తర్వాత పెరుగు, చిల్లీ సాస్, కారం, గరం మసాలా, చక్కెర, కొత్తిమీర వేశాక, వేయించి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని వేసి కలియబెట్టాలి. కాసేపు వేయించిన తర్వాత దించుకుంటే ఎగ్ 65 రెడీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- egg 65
- egg dish
- tasty food
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

