చిటికెలో పర్ఫెక్ట్ డ్రెస్

కంటికి ఇంపుగా కనిపించిన డ్రెస్ ఒంటికి సరిపోతుందా అనేది తెలుసుకోవడం ఎలా? ట్రయల్ రూమ్స్ ఉన్నాయిగా అంటారా! అదంతా పాత ట్రెండ్. ‘ఆయెనా’ స్టార్టప్ ఈ పనిని తేలిక చేసింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన యాప్ సాయంతో వినియోగదారులు వారి శరీరానికి నూటికి నూరుపాళ్లు నప్పే డ్రెస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగుమెంటెడ్ టెక్నాలజీ కలగలసిన ‘ఆయెనా సైజింగ్’ యాప్ ఫోన్లో ఉంటే ట్రయల్ రూమ్ ముందు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడదు. నొయిడాకు చెందిన సంక్షిత్ గ్రూప్ ‘సైజింగ్’ పేరుతో ఈ బాడీ మెసర్మెంట్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ‘ఆయెనా’కు సాక్షి ఛాపోలీ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈ యాప్‌లో శరీర కొలతలు, బరువు, ఎత్తు వివరాలు నమోదు చేసుకుంటే.. కాగల కార్యం అదే నెరవేస్తుంది. వినియోగదారులు నమోదు చేసిన వివరాల ఆధారంగా వివిధ బ్రాండ్లలో వారికి సరిగ్గా నప్పే దుస్తులను ఎంపిక చేస్తుంది. ఆన్లైన్ షాపింగ్‌లో దుస్తుల ఎంపికలో ఈ యాప్ ఎంతగానో సహకరిస్తుంది. ఆఫ్లైన్లోనూ అంతే సమర్థంగా పనిచేస్తుంది. పలు బ్రాండెడ్ దుస్తులతో ఆయెనా టైఅప్ అయింది. వివిధ మోడల్స్‌లో ఉన్న ఫర్ఫెక్ట్ దుస్తుల జాబితాను వినియోగదారుల ముందుంచుతుంది. నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కస్టమర్ల శరీర కొలతలను అప్డేట్ చేసుకునే వెసులుబాటూ ఇందులో ఉంది. మొత్తానికి ‘ఆయెనా’ సైజింగ్ యాప్ తోడుగా ఉంటే ఎలాంటి ట్రయల్ లేకుండానే పర్ఫెక్ట్ దుస్తులను కొనుగోలు చేయొచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Black Dress
- Perfect dress
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

