ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌లో.. ఫోల్డబుల్ ఫోన్లదే అగ్రస్థానం. అయితే, స్క్రీన్‌పై మడత కనిపించడం, మడత పెట్టినప్పుడు మందంగా ఉండటం.. వీటిలోని మైనస్ పాయింట్లు. ఈ లోపాలను సరిదిద్దుతూ.. ఒప్పో సంస్థ నెక్ట్స్ లెవల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేసింది. ఒప్పో ఫైండ్ ఎన్6 పేరుతో.. ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త ఫ్లాగ్షిప్ మోడల్.. స్టయిలిష్ లుక్, పవర్ఫుల్ ఫీచర్లతో టెక్ ప్రియులను మెస్మరైజ్ చేస్తున్నది. టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టిస్తున్నది. ఈ ఫోన్‌ను ఫోల్డ్ చేసినప్పుడు కేవలం 8.93 ఎంఎం మందంతో.. చాలా సన్నగా ఉంటుంది.
ఇందులోని టైటానియం అలాయ్ హింజ్ వల్ల.. స్క్రీన్‌పై మడత ఏమాత్రం కనిపించదు. ఇక ఈ ఫోన్లోని ఇతర ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇందులో 8.12 అంగుళాల భారీ 2కే ఫోల్డబుల్ స్క్రీన్‌ను ఏర్పాటుచేశారు. ఎల్టీపీవీఓ టెక్నాలజీతో వస్తున్న ఈ స్క్రీన్.. విజువల్ పరంగా రిచ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. వీడియో గేమ్స్ ఆడుతున్నా, హై క్వాలిటీ వీడియోలు చూస్తున్నా.. రిఫ్రెష్‌రేట్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఫోన్ బయటివైపు 6.62 అంగుళాల కవర్ డిస్ప్లే ఉంటుంది. దాంతో ఫోన్ ఓపెన్ చేయకుండానే చాలా పనులను చక్కబెట్టుకోవచ్చు. ఇక పెర్ఫార్మెన్స్ విషయంలోనూ ‘తగ్గేదే లే!’ అంటున్నది ఒప్పో.
ఫైండ్ ఎన్6లో సరికొత్త క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (జెన్ 5) చిప్‌సెట్‌ను పొందుపరిచారు. 16 జీబీ ర్యామ్ కూడా తోడవ్వడంతో.. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ చేసినా ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. ఇక ఫొటోగ్రఫీకి పెద్దపీట వేస్తూ.. ఇందులో ఏకంగా హాసెల్‌బ్లాడ్ సహకారంతో రూపొందించిన 200ఎంపీ మెయిన్ కెమెరాను అమర్చారు. ఫోల్డబుల్ ఫోన్లలో ఇంత భారీ కెమెరా సెన్సర్ రావడం ఇదే మొదటిసారి అని ఒప్పో ప్రతినిధులు చెబుతున్నారు. దాంతోపాటు రెండు 50ఎంపీ సెన్సర్లు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, ల్యాండ్‌స్కేప్ షాట్స్, నైట్ ఫొటోగ్రఫీ.. ఇలా ఏది తీసినా క్లారిటీ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దాంతో చార్జింగ్ టెన్షన్ ఉండదు. 80వాట్స్ ఫాస్ట్ చార్జింగ్తోపాటు వైర్లెస్ చార్జింగ్ సదుపాయం కూడా ఏర్పాటుచేశారు. స్టోరేజ్ కోసం 256 జీబీ నుంచి 1టీబీ వరకు మెమొరీ ఆప్షన్లు ఉన్నాయి. ఫోల్డబుల్ ఫోన్లలో అత్యంత సన్నగా, శక్తిమంతమైన ఫోన్‌గా ఇది టెక్ ప్రియుల మనసు దోచేస్తున్నది.