Meeta Sharma Gupta | ‘బిడ్డ ఆడుకునేందుకు మార్కెట్లో మంచి బొమ్మ ఒక్కటీ లేదు. ఎదిగే పిల్లల్లో జీవన నైపుణ్యాలను వెలికితీయాలన్న ఆలోచన ఏ బొమ్మల తయారీ సంస్థకూ రాదు. ఈ సమస్యకు ఎలాగైనా ఓ పరిష్కారం చూపాలి’ అని నిర్ణయించుకున్నది ఓ అమ్మ. ఇక లాభం లేదనుకొని తనే ఆర్గానిక్ బొమ్మల తయారీకి పూనుకున్నది.
మీతాశర్మ కొంతకాలం విదేశాల్లో ఉన్నది. తర్వాత బెంగళూరు తిరిగొచ్చింది. తన కొడుకు ఆడుకునేందుకు మార్కెట్లో మంచి ఆట వస్తువులే లేవని అర్థమైంది. ఒకటీ అరా ఉన్నా అనారోగ్యకరమైనవే. ఆ లోటు తీర్చడానికి ‘షుమీ( Shumee )’ అనే పేరుతో పర్యావరణ హితమైన ఆట వస్తువుల తయారీకి సిద్ధపడింది మీతా. అన్ని వయసుల చిన్నారులనూ ఆకర్షించేలా బొమ్మలు తయారు చేస్తున్నదామె. ఏ దశలోనూ రసాయనాలను ఉపయోగించే ప్రసక్తే లేదు. షుమీ బ్రాండ్ బొమ్మలు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. సరికొత్తగా బొమ్మలను రూపొందించే క్రమంలో చిన్నపిల్లల సలహాలు, సూచనలు తీసుకుంటుంది మీతా శర్మ. వాళ్లతో కలిసి ఆడుతుందీ పాడుతుందీ!