Women Rights | పుట్టింట్లో నాకు హక్కు లేదా?

పెండ్లయిన మహిళకు పుట్టింటిపై హక్కులు ఉంటాయా? అన్నదమ్ములతో సమానంగా ఆ ఇంట్లో ఉండవచ్చా? ఒకవేళ, ఆ ఇల్లు తండ్రి పేరు మీద ఉంటే, పెండ్లయిన అన్నదమ్ములతో కలిసి నివసించవచ్చా? తల్లి, అన్నదమ్ములు, వదినామరదళ్లు వద్దంటే ఆ ఆడబిడ్డ పరిస్థితి ఏమిటి? సరిగ్గా ఇలాంటి సమస్యనే నేను ఎదుర్కొంటున్నాను. పరిష్కారం చెప్పగలరు.
– ఓ సోదరి
పెండ్లయిన ఆడపిల్ల పుట్టింట్లో ఉండొచ్చని కానీ, ఉండకూడదని కానీ చెప్పే ఎలాంటి ప్రత్యేక చట్టమూ మనకు లేదు. అయితే, కన్నవారి ఇంట్లో ఉండేందుకు అమ్మాయికైనా, అబ్బాయికైనా సమాన హక్కులు ఉంటాయి. తల్లిదండ్రులు ప్రత్యేకించి వీలునామా రాసినప్పుడు మినహా, మిగతా సందర్భాల్లో హిందువుగా పుట్టిన కూతురికైనా, కొడుకుకైనా చట్ట ప్రకారం సమాన హక్కులు లభిస్తాయి. ఒకవేళ పెద్దవాళ్లు వీలునామా రాస్తే మాత్రం, ఆస్తిపాస్తులు ఆ ప్రకారంగానే చెందుతాయి. మీరు పుట్టింట్లోనే ఉంటున్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని వేధిస్తున్నట్లయితే అది గృహహింస కిందికే వస్తుంది. అయితే, గృహహింస చట్టాన్ని అమలు చేయాలంటే కచ్చితంగా బాధితురాలు అదే ఇంట్లో నివసిస్తూ ఉండాలి.
మానసి చౌదరి
అడ్వకేట్
www.pinklegal.in
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఎం శ్రీ ప్రధానోపాధ్యాయులకు బెంగళూరులో శిక్షణ
ఎంజీయూలో వినూత్న కార్యక్రమం.. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’
ACB Net | రెవెన్యూ రికార్డులో పేరును సరిదిద్దేందుకు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జీపీవో
Supreme Court: చదువుకున్నవాళ్లు డిజిటల్ అరెస్టు ఎలా అవుతున్నారు.. సుప్రీంకోర్టు షాక్
కాంగ్రెస్ సర్కార్‌కు గ్రాడ్యూయేట్లు బుద్ధి చెప్పాలి : తక్కెళ్లపల్లి రవీందర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

