లెహంగామా!

సంప్రదాయం అయినా, పాశ్చాత్యం అయినా పిల్లలకు ఏ డ్రెస్సు వేసినా చూడముచ్చటగానే ఉంటారు. ఇక నిండుగా కనిపించే
లెహంగాల సంగతి చెప్పేదేముంది? చంగుచంగున గెంతులేసే అల్లరి పిల్లలను కదలకుండా కట్టేసి, కుదురుగా ఉంచుతాయివి. అందుకే అమ్మలు పండుగలూ పెండ్లిళ్ల వంటి ప్రత్యేక సందర్భాల్లో వ్యూహాత్మకంగా లెహంగాలు తొడుగుతారు. వీటిలోని సరికొత్త డిజైన్లేంటో చూద్దాం..
పట్టుతో ప్రత్యేకంగా..
రెగ్యులర్ డ్రెస్సులకి భిన్నంగా ఉన్న ఈ లెహంగా గ్రాండ్‌లుక్‌ని ఇస్తుంది. ఎర్రని సెమీ నెట్టెడ్ క్లాత్‌కు సిల్వర్కలర్తో ఉన్న భారీ జరీని ప్యాచ్ చేయడం వల్ల నిండుదనం వచ్చింది. బార్డర్‌కి నప్పేలా ఇచ్చిన క్రాప్టాప్పై స్పెషల్‌గా మగ్గం, కట్ వర్క్స్ చేయించారు. లెహంగా, క్రాప్టాప్కి నప్పేలా గోల్డ్‌కలర్ ఫ్లవర్స్‌తో బ్లూ కలర్ దుపట్టా ఉంది. పైన టాప్‌కి, దుపట్టా చివర్లకి స్పెషల్ వర్క్‌తో మ్యాచ్ చేశారు.
బంగారు బొమ్మలా..
గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎప్పుడూ స్పెషల్ లుక్‌ను ఇస్తుంది. లెహంగాపై క్రాప్‌టాప్‌ని గోల్డ్ నెట్ ఫ్యాబ్రిక్మీద మిర్రర్ వర్క్‌తో డిజైన్ చేశారు. బాడీ పార్ట్‌లో చేసిన మగ్గం వర్క్‌తోపాటు మెడ చుట్టూ ప్రత్యేకంగా కనిపించే అద్దాల వరుస చక్కగా ఉంది. గోల్డ్మీద రెడ్ కలర్‌ని హైలెట్ చేశారు. నెట్టెడ్ క్లాత్‌తో రూపొందించిన లెహంగా పిల్లలను ఇబ్బంది పెట్టకుండా సేమ్ కలర్ లైనింగ్‌తో డిజైన్ చేశారు. కాంబినేషన్‌కి నప్పేలా ఇచ్చిన గోల్డ్, రెడ్ బోర్డర్లు లెహంగాకి గ్రాండ్ లుక్ తీసుకొచ్చాయి.
హల్దీ స్పెషల్..
పచ్చని పసుపు రంగులో నిండైన డిజైన్ ఇది. పెండ్లి వేడుకలోని హల్దీ వంటి ఫంక్షన్స్‌లో ఈ లెహంగాతో తోడు పెళ్ళికూతురిలా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎల్లోకలర్ సిల్క్‌పై మిర్రర్, జరీ వర్క్ చేసి ఈ క్రాప్‌టాప్‌ని డిజైన్ చేశారు. లెహంగా, టాప్, దుపట్టా .. అన్నింటినీ ఒకే రంగుతో రూపొందించారు. దుపట్టా చివర్లో ఇచ్చిన హ్యాండ్ మేడ్ తస్సెల్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేలా ఓ చక్కని ఫ్లవర్‌తో ఇచ్చిన హెయిర్‌బ్యాండ్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.
డిజైనర్
రితేషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్,
follow us on:instagram.com/riteshareddy, 7013639335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

