ఫ్యాషన్‌లో..తొలి వరుస!
అమ్మాయికి ఎన్ని పేట్ల గొలుసు వేస్తున్నారు? ఒకప్పుడు పెండ్లిచూపుల్లో ప్రతిధ్వనించిన ప్రశ్న. ఎందుకంటే, ఎన్ని వరుసల గొలుసు వేస్తే అంత గొప్ప. పుట్టింటివారికి అంత ప్రేమ ఉన్నట్టు. ఇప్పుడుకూడా వరుసల గొలుసులు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి.
‘స్టెప్స్ జువెలరీ’ పేరుతో మామూలు గొలుసులనుంచి డైమండ్ నెక్లెస్‌లు, హారాలు, డిజైనర్ నగలవరకూ వరుసబెట్టి మగువ మెడలో తళుకులీనుతున్నాయి. ఈ వరుసల గొలుసుల ధగధగలేమిటో చూద్దామా…

- ఏఫంక్షన్లో చూసినా సంప్రదాయ దుస్తులపైనా, ఫ్యాషన్ వేర్పైనా రకరకాల నగలు వరుసల్లో మెరుస్తున్నాయి. సన్నటి గొలుసుల నుంచి పెద్దపెద్ద నెక్లెస్‌ల వరకు మూడునుంచి ఏడు వరుసల్లో రూపొందుతున్న నగలు మగువల మనసులను దోచేస్తున్నాయి.
- ఈవరుసల గొలుసుల సంప్రదాయం ఇప్పటిదేం కాదు. తరాలనుంచీ మన నగల్లో భాగమే. చంద్రహారాలు, సూర్యహారాలు వంటి పేర్లతో మూడు, ఐదు వరుసల గొలుసుల్ని చాలా ఏండ్లనుంచీ ధరిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో ఇవి వంశపారంపర్య నగలుగానూ వస్తున్నాయి. ఈ హారాల్లో ఒకే డిజైన్‌లో ఉన్న గొలుసులు, కాస్త నిడివి తేడాతో వరుసల్లో అమరి ఉంటాయి. వీటన్నిటినీ కలుపుతూ ఓ మందపాటి బిళ్ల ఉంటుంది. ఎక్కువగా ఈ బిళ్ళలపైన సూర్యబింబం ముద్రిస్తారు. పేర్లుకూడా అచ్చు వేయిస్తారు.
- రకరకాల బీడ్స్, డైమండ్స్ కాంబినేషన్లో డిజైన్ చేసిన ఈ స్పెషల్ జువెలరీ మెడనుంచి ఛాతీవరకు పరుచుకుని కంఠాభరణంలా గ్రాండ్ లుక్ ఇస్తుంది.
- ఇదివరకటి రోజుల్లో పెండ్లికూతురికి పెట్టే నగల్లో కచ్చితంగా ఉండేది. గొలుసుల్లోని వరుసల్నిబట్టి కుటుంబ తాహతు అంచనా వేసేవారు. పల్లెలకు సంబంధించినంత వరకూ అదో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాను తలపించే వ్యవహారం.
- వరుసల నగలు మెడలోనేకాదు చెవులు, చేతులు, కాళ్ళకూ కనువిందు చేస్తున్నాయి. కొందరు మగువలు తలపై రకరకాల డిజైన్లలో రూపొందించిన గొలుసులను అలంకరించుకొంటున్నారు. ఇవి దొంతర దొంతరలుగా తలంతా వ్యాపించి సరికొత్త అందాన్నిస్తున్నాయి. చెవి
- కమ్మలకు జతగా జడకు ముస్తాబు చేసే చెంప గొలుసులు పాతకాలం నగలే అయినా, ప్రస్తుతం నయా డిజైన్లలో అతివలను ఆకట్టుకుంటున్నాయి. కమ్మలు, ఉంగరాలు, కాలి పట్టీల్లోనూ వరుస ట్రెండ్ నడుస్తున్నది.
- ఈనగల్లోని వరుసలన్నీదాదాపుగా ఒకేలా ఉంటాయి. రెండువైపులా రకరకాల డిజైన్లతో ఉండే చివర్లకి జత చేసి ఉంటాయి. కొన్నిసార్లు ఈ వరుసలూ వైవిధ్యంగా కనిపిస్తాయి. ఒక్కో వరుస ఒక్కో డిజైన్‌లో ఉంటుంది. కింది వరుస కాస్త లావుగా, పై వరుస కాస్త సన్నగా, ఆపై వరుస మరింత సన్నగా.. ఇలా దొంతరలు దొంతరలుగా కనువిందు చేస్తాయి. పెండ్లి కూతుళ్లను ముస్తాబు చేసే నగల్లో, దేవతలకు అలంకరించే ఆభరణాల్లో ఈ వరుసల డిజైన్లు ఎక్కువ.
- గొలుసుల వరుసల సంఖ్యపైనా కొన్ని నమ్మకాలున్నాయి. ప్రాచీనకాలం నుంచీ మూడు లేకపోతే ఐదు వరుసల గొలుసుల్ని ధరించేవారు. మరీ ఎక్కువగా అంటే, తొమ్మిది వరుసలు. మూడు, ఐదు, తొమ్మిది.. ఈ మూడూ అదృష్ట సంఖ్యలే. ఇప్పుడుకూడా ఇదే ఫాలో అవుతున్నారు.
- ప్ర స్తుతం సూర్య హారాలు, చంద్రహారాలు వేసుకునే వాళ్లను ఎర్రబస్సు బ్యాచ్ కిందే జమ కడుతున్నారు. కానీ, ఒకప్పటి సంప్రదాయ నగల్నే సరికొత్తగా రీడిజైన్ చేసి, నేటి మహిళల మనసుల్ని దోచేస్తున్నారు తయారీదారులు. రకరకాల కాంబినేషన్లలో వరుసల్ని పేరుస్తూ సృజనకు పెద్దపీట వేస్తున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

