బీపీ రీడింగ్ ఎప్పుడు తీసుకోవాలి?
బీపీ-రక్తపోటు... హై అయినా, లో అయినా అది ఆందోళనకరమే. లో బీపీని మంచి ఆహారంతో సరిచేసుకోవచ్చు. హై బీపీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. లేదంటే అది గుండెపోటు, పక్షవాతం లాంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే, బీపీ పరీక్షించుకోవడానికి తగిన సమయమేంటో తెలుసుకుని ఉండాలి.
బీపీ-రక్తపోటు… హై అయినా, లో అయినా అది ఆందోళనకరమే. లో బీపీని మంచి ఆహారంతో సరిచేసుకోవచ్చు. హై బీపీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. లేదంటే అది గుండెపోటు, పక్షవాతం లాంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే, బీపీ పరీక్షించుకోవడానికి తగిన సమయమేంటో తెలుసుకుని ఉండాలి. వ్యాయామం, ఒత్తిడి, తీసుకునే ఆహారం, నీళ్లు తాగే విధానం (డీహైడ్రేషన్ బీపీపై ప్రభావం చూపుతుంది), శరీర భంగిమ మొదలైన వాటివల్ల రక్తపోటు (బీపీ) మారుతూ ఉంటుంది. వీటి కారణంగా మనకు తోచినప్పుడు బీపీ పరీక్షించుకుంటే సరైన ఫలితాలు కనిపించవు. దాదాపు కచ్చితమైన ఫలితాలు కనిపించాలంటే రోజులో ఒకే రకమైన పరిస్థితులు, స్థిరమైన సమయాల్లో బీపీ రీడింగ్ తీసుకోవాలి.
తొలి రీడింగ్
తొలి రక్తపోటు (బీపీ) రీడింగ్‌కు పొద్దున నిద్ర లేచిన అర్ధగంట తర్వాత సమయం సరైందని నిపుణుల మాట. అయితే, ఏమీ తినకూడదు. కాఫీ లాంటి ద్రవ పదార్థాలు తాగకూడదు. నీళ్లు ఫర్వాలేదు. ఇప్పుడే ఎందుకంటే… నిద్ర లేవగానే మీ శరీరం నిద్ర మత్తు నుంచి బయటపడటానికి చూస్తుంటుంది. కాబట్టి, నిద్ర లేచిన వెంబడే బీపీ రీడింగ్స్ సరిగ్గా రాకపోవచ్చు.
రాత్రి పడుకునే ముందు
రోజులో రెండోసారి బీపీ రీడింగ్ తీసుకోవడానికి నిద్రకు ముందు అనువైన సమయం. కాకపోతే రాత్రి భోజనం చేసిన రెండు గంటల తర్వాత తీసుకోవాలి. ఇది రోజులో మీ బీపీ ఎలా మారిందో తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. మీ గుండె, రక్త నాళాల ఆరోగ్యం గురించి పూర్తి సమాచారం ఇస్తుంది.
ఎంత తరచుగా?
ఇంటి దగ్గరే బీపీ చూసుకునేవాళ్లు రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం రెండుసార్లు రీడింగ్ తీసుకోవాలి. వేర్వేరు సమయాల్లో రీడింగ్ తీసుకోవడం వల్ల బీపీ కచ్చితత్వం తెలిసి వస్తుంది. ఇక ఒకేసారి రెండు రీడింగులు తీసుకోవాలనుకుంటే మొదటి దాని తర్వాత మూడు నిమిషాలు ఆగాలి. ఆ తర్వాత రెండిటినీ నమోదు చేసుకోవాలి. రెండిటి మధ్య తేడా ఎక్కువగా ఉంటే మూడోది అవసరమవుతుంది. ఆ తర్వాత మూడిటి సగటు లెక్కించాలి. బీపీ మిషన్ ఒకేదానిని వాడాలి. శరీరం ఒకే భంగిమలో ఉండాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
NZvsIND: ఇండియా టార్గెట్ 199
Mrunal Thakur | రష్మిక పాత్ర కోసం వెళ్లి సీతగా.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే.!
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

