తండ్రి ఆస్తిని నమ్ముకోలేదు
ఐపీఎల్ సీజన్ ముగిసి చాలారోజులైంది. ఈ క్రికెట్ పందేరం జరిగిన ప్రతిసారీ.. దీని రూపకర్త లలిత్ మోదీ గురించి చర్చోపచర్చలు సాగడం కామన్. ఈసారీ అదే జరిగింది. కానీ, ఈసారి భిన్నంగా మోదీ కూతురు ఆలియా గురించి గొప్పగా చెప్పుకొన్నారు.
ఐపీఎల్ సీజన్ ముగిసి చాలారోజులైంది. ఈ క్రికెట్ పందేరం జరిగిన ప్రతిసారీ.. దీని రూపకర్త లలిత్ మోదీ గురించి చర్చోపచర్చలు సాగడం కామన్. ఈసారీ అదే జరిగింది. కానీ, ఈసారి భిన్నంగా మోదీ కూతురు ఆలియా గురించి గొప్పగా చెప్పుకొన్నారు. ఎందుకంటే.. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదామె! తండ్రి ఎక్కడికి వెళ్లినా.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. కావాల్సినంత ఆస్తి అయితే కూడబెట్టాడు. అయితే, తండ్రి ఆస్తిని నమ్ముకోకుండా స్వశక్తితో పైకి రావాలనుకుంది ఆలియా. తనకు ఆసక్తి ఉన్న ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో అద్భుతాలు ఆవిష్కరిస్తున్నది. బోస్టన్లోని బ్రాండీస్ యూనివర్సిటీలో ఆర్ట్ హిస్టరీలో బ్యాచ్‌లర్ డిగ్రీ చేసిన ఆలియా… లండన్‌లోని ఇంచ్బాల్డ్ (inchbald school of design) స్కూల్ ఆఫ్ డిజైన్‌లో ఆర్కిటెక్చురల్ ఇంటీరియర్ డిజైన్‌లో మాస్టర్స్ చేసింది. తర్వాత ‘ఏఎమ్ఆర్ఎమ్’ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ లిమిటెడ్‌ను స్థాపించి ఇంటీరియర్ డిజైనర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టింది. తక్కువ సమయంలోనే సొంతంగా రూ.41 కోట్లు సంపాదించింది. 2022లో బ్రెట్ కార్ల్‌సన్‌ను పెండ్లాడిన ఆమె… తాజాగా ఐపీఎల్ ఫీవర్ ముగిసినా వార్తల్లో మాత్రం విహరిస్తూనే ఉంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

